Hari Hara Veera Mallu : అమరావతి – పవన్ కళ్యాణ్ కొణిదల నటించిన హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా కాదని అది ఓ చరిత్ర అని అన్నారు శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ స్వామి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన పవన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నారు. గతంలో ఏం జరిగిందో తెలుసు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వందల సంవత్సరాల ముష్కరుల పరిపాలన, తెల్లదొరల బానిసత్వపు పాలన ఈ దేశంలో వారు నాటిన విష బీజాలు ఈనాటికి పేట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు శివ స్వామి. ఈ దేశంలో ఒక పక్కన టెర్రరిజంతో దాడులు మరో పక్కన కమ్యూనిస్టుల దాడులు , ఇంకో పక్కన పదుల సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, మత పిచ్చితో హింసాత్మక దాడులు చేస్తున్న ముస్లిం మత వ్యవస్థలకు ఈ సినిమా చెంప పెట్టు అవుతుందన్నారు.
Hari Hara Veera Mallu Movie – Sri Sri Sri Siva Swami
అంతే కాకుండా ఒకప్పుడు చాప కింద నీరు లాగా మతాన్ని వ్యాప్తి చేస్తున్న క్రిస్టియన్లు ఇప్పుడు బహిరంగంగానే మత ప్రచారం చేస్తున్నారని, మూర్ఖపు విధానాలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న నాస్తికులు , కులాల గుంపులాటలలో నైతిక విలువలను కోల్పోతున్న కుల పిచ్చిపెద్దలు, ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులుముతున్న రాజకీయవేత్తలు , హిందువులు గా పుట్టి దేశ ద్రోహానికి పాల్పడుతున్న ఇంటి దొంగల నుంచి ఇవాళ హిందూ ధర్మం ఎదుర్కొంటోందన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినా, ఆలయాల హుండీలలోని డబ్బులు మాయం అవుతున్నా , దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నా హిందూ సమాజం స్తబ్దుగానే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివ స్వామి.
ఎందుకంటే గత చరిత్రని కచ్చితంగా మనం చదవలేక పోయామన్నారు. అసలైన చరిత్ర ఇది అంటూ కాశ్మీర్ ఫైల్స్ , కేరళ స్టోరీ , చావా సినిమాలు చాటి చెప్పాయన్నారు. ఇప్పుడు అదే కోవలోకి పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు వస్తుందన్నారు . రాబోయే తరాల వారికి ఇది ఒక చరిత్రగా ఉంటుందన్నారు. హిందూ సమాజం ఈ సినిమాను ఆదరించాలని పిలుపునిచ్చారు శ్రీశ్రీశ్రీ శివ స్వామి.
Also Read : TTD Sensational Decision : రేపటి నుంచి ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శనం



















