Hari Hara Veera Mallu : అమరావతి – తన సోదరుడు పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం హరి హర వీరమల్లు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కొణిదెల. ధర్మం కోసం పోరాడిన ఓ వీరుడి కథ ఇదన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎంత నిబద్ధతతో చేస్తారో సినిమాలు కూడా అంతే నిబద్ధతతో చేస్తారన్నారు. తాను షూటింగ్ కి వెళ్లినప్పుడు పవన్ లో ఆ డెడికేషన్ కనిపించిందన్నారు. ఇంకో 20 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి రాదని జోష్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా కృషి చేస్తోందని చెప్పారు.
Nagababu – Hari Hara Veera Mallu
నాగబాబు కొణిదల మీడియాతో మాట్లాడారు. గతంలో ఏపీని పాలించిన జగన్ రెడ్డి సర్కార్ ఏపీని సర్వ నాశనం చేసిందన్నారు. భారీగా అప్పులు చేసిందని, వాటికి వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నామని అన్నారు. అయినా వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదన్నారు. గత ఎన్నికల్లో అందుకే ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, దానిని గుర్తించి నడుచుకుంటే మంచిదని హితవు పలికారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లుకు (Hari Hara Veera Mallu) మిశ్రమ స్పందన లభించింది. దీనిని భారీ ఖర్చుతో ఎంఎం రత్నం నిర్మించాడు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మూవీ.
ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 77 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇది పక్కన పెడితే ఈ సినిమా రావడానికి చాలా సమయం పట్టింది. దర్శకుడు క్రిష్ మారాడు. కొత్త డైరెక్టర్ వచ్చినా ఆశించిన మేర ఆకట్టుకునేలా తీయలేదన్న విమర్శులు ఉన్నాయి. అయితే నాగ బాబు మాత్రం తన సోదరుడి సినిమా సూపర్ హిట్ అంటూ పేర్కొనడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Beauty Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాకి పారితోషకం భారీగా పెంచిన జాన్వీ
