Hero Teja Sajja – Mirai : ఆద‌రిస్తున్నందుకు ఆనందంగా ఉంది : స‌జ్జా

కాసుల వ‌ర్షం కురిపిస్తున్న మిరాయి చిత్రం

Hello Telugu - Hero Teja Sajja - Mirai

Hello Telugu - Hero Teja Sajja - Mirai

Teja Sajja : టీజీ విశ్వ ప్ర‌సాద్ భారీ ఖ‌ర్చుతో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించిన చిత్రం మిరాయ్. వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైంది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. బిగ్ స‌క్సెస్ టాక్ తో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది ఈ మూవీ. ఇందులో కీల‌క పాత్ర పోషించారు న‌టుడు తేజ స‌జ్జా (Teja Sajja), మంచు మ‌నోజ్, జ‌గ‌ప‌తి బాబు , శ్రియా శ‌రణ్ న‌టించారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆద‌రణ ల‌భిస్తుండ‌డంతో ఆనందం వ్య‌క్తం చేశారు న‌టీ న‌టులు. ఈ సంద‌ర్బంగా మూవీ స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు హైద‌రాబాద్ లో శ‌నివారం. ఈ సంద‌ర్బంగా ముఖ్య భూమిక పోషించిన న‌టుడు , ద‌ర్శ‌కుడు తేజ స‌జ్జా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Teja Sajja Comments on His Mirai Movie

త‌మ మిరాయ్ ప్ర‌యాణం గురించి త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. తాను న‌టించిన హ‌నుమాన్ బిగ్ స‌క్సెస్ చేశారు. త‌ర్వాత ఎక్కువగా మ‌న‌సు పెట్టి చేసిన మూవీ మిరాయ్ . దీనిని అంత‌కంటే ఎక్కువ‌గా ఆద‌రిస్తుండ‌డం మ‌రింత సంతోషాన్ని క‌లిగిస్తోంద‌న్నాడు. దీనికి తాను ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేయాల్సింది మాత్రం నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ అన్నారు. త‌ను ఇప్పుడు డార్లింగ్ ప్ర‌భాస్ తో రాజా సాబ్ తీస్తున్నాడు. ఇది త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల తాను హ‌రీశ్ శంక‌ర్ తో తీసిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఆశించిన మేర ఆడ‌లేదు. త‌న‌కు భారీ న‌ష్టాన్ని తీసుకు వ‌చ్చింది. అయినా ఎక్క‌డా ఆగ‌డం లేదు. భారీ ఎత్తున కోట్ల‌ల్లో న‌ష్ట పోయాడు. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. మొత్తంగా సినిమా స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల ఖుష్ అయ్యారు.

Also Read : YSRCP Fired on AP Govt : క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రాక రైత‌న్న‌ల గోస‌

Exit mobile version