హైదరాబాద్ : మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో తాను చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సామాన్యంగా ఆనంద్ మహీంద్రా ఎవరినీ పొగడరు. వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉండే ఆయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దేశానికి సంబంధించి కీలకమైన అంశాల గురించి ప్రస్తావిస్తారు. తన అభిప్రాయాలను నిర్మోహ మాటంగా వ్యక్తం చేస్తారు. అంతే కాదు కష్టపడి పైకి వచ్చిన వారిని, సామాన్యుల నుంచి అసమాన్యులుగా ఎదిగిన వాళ్లను, స్పూర్తి దాయకంగా ఉండే కథలను, వ్యక్తులను ప్రత్యేకంగా పరిచయం చేస్తారు. ఇది ఆయన ప్రత్యేకత.
తాజాగా ఆనంద్ మహీంద్ర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కార్ ప్రతిష్టాత్మకంగా తెలంగాన గ్లోబల్ రైజింగ్ 2047 సమ్మిట్ ను నిర్వహించారు. ఇందులో కీలక పాత్ర పోషించారు ఆనంద్ మహీంద్రా. ఈ సందర్బంగా ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వేదికను పంచుకున్నారు. మెగాస్టార్ ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఓ లెజండ్ అని పేర్కొన్నారు. అంతే కాదు ఆయన కనపరిచే వినయం, నిజమైన ఉత్సుకత తనను విస్తు పోయేలా చేసిందన్నారు ఆనంద్ మహీంద్రా.



















