Pawan Kalyan : హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన సోదరుడు , ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఏపీలోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971లో పుట్టాడు. తల్లిదండ్రులు వెంకటరావు, అంజనా దేవి. నాగబాబు సోదరుడు. పవన్ పూర్తి పేరు కొణిదల కాటరాయుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. పాలిటిక్స్ లోకి ప్రవేశించాడు. జనసేనను స్థాపించి పవర్ లోకి వచ్చేలా చేశాడు. తండ్రి చని పోయాడు. తల్లి బతికే ఉంది. చిన్నప్పటి నుండి కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది, బ్లాక్ బెల్ట్ సంపాదించారు.
AP Deputy CM Pawan Kalyan Birthday
1996లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా. ఆ తర్వాత 1997లో గోకులంలో సీత, 1998లో సుస్వాగతం తో పేరు తెచ్చుకున్నాడు. తొలిప్రేమ తనకు బ్రేక్ తీసుకు వచ్చేలా చేసింది. తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి సినిమాలు యువతలో ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టాయి. జానీ, గుడుంబ శంకర్, బంగారం వంటివి పెద్దగా విజయం సాధించక పోయినా, ఆయన కున్న అభిమానగణం పెరుగుతూనే వచ్చింది. ఇదే సమయంలో హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ దుమ్ము రేపింది. తన స్టార్ ఇమేజ్ ను మరింత పెంచేలా చేసింది. ఆయన కెరీర్‌ను మళ్లీ టాప్‌కి తీసుకెళ్ళింది. 2013లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 2013లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన హరి హర వీరమల్లు ఆశించిన మేర ఆడలేదు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఓజీ విడుదలకు సిద్దంగా ఉంది.
ఆ తర్వాత అనూహ్యంగా తాను పాలిటిక్స్ లోకి ప్రవేశించాడు. మొదట 2008లో ప్రజా రాజ్యం పార్టీ (చిరంజీవి స్థాపించిన పార్టీ)కి యువరాజు లాగా పనిచేశారు. 2014లో జనసేన పార్టీను స్థాపించారు. ప్రజల కోసం, దేశం కోసం అనే నినాదంతో ప్రజల ముందుకొచ్చారు. తాను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయక పోయినా, బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో మళ్లీ బీజేపీతో కూటమిగా పోటీ చేసి అద్భుత విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు.
Also Read : Minister Nara Lokesh interesting Comments : పవనన్నా కలకాలం చల్లంగా బతుకు : లోకేష్



















