Hamad Alamori : హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్మీ సంస్థ సీఆర్పీఎఫ్ తో ఒప్పందం చేసుకుంది ప్రముఖ సంస్థ మెయిల్, ఐకామ్ , కారకాల్. ఈ సందర్భంగా కారకాల్ సీఈఓ హమాద్ అలామెరి (Hamad Alamori) మాట్లాడారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐకామ్–కారకాల్ స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్ ప్రారంభం తర్వాత, మా భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా పథకానికి తాము కట్టుబడి ఉన్నామని మరోసారి నిరూపిస్తున్నాం అని పేర్కొన్నారు. చిన్న ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీలో ఇది చారిత్రాత్మక ఘట్టం అని స్పష్టం చేశారు సీఈవో. భారత భద్రతా అవసరాలకు, పెరుగుతున్న రక్షణ పరిశ్రమకు మద్దతుగా భారత్–యూఏఈ రక్షణ సహకారం ఎంత బలంగా ఉందో దీని ద్వారా స్పష్టమవుతోంది అని అన్నారు.
Hamad Alamori Big Deal with CRPF
అలాగే ఐకామ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు మాట్లాడారు. సి ఆర్ పి ఎఫ్ తో ఒప్పందం మా సంస్థకు గర్వకారణం అని అన్నారు. భారత్‌లో స్వయం రక్షణ సామర్థ్యాల అభివృద్ధి కోసం మా దీర్ఘకాల వ్యూహానికి ఇది గొప్ప గుర్తింపుగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. కారకాల్, ఎడ్జ్‌తో కలిసి మేము కేవలం ఆధునిక సీఎస్ఆర్ -338 స్నైపర్ రైఫిల్స్‌ను సరఫరా చేయడమే కాదు, ప్రపంచ స్థాయి సాంకేతికతను బదిలీ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలను సృష్టిస్తూ, భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అన్నారు. భవిష్యత్ అవసరాలు, ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
Also Read : Minister Nara Lokesh Interesting Comments : చాగంటి కోటేశ్వర్ రావు జీతం తీసుకోవడం లేదు



















