ఢిల్లీ : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యారు. ఆయన తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు మీడియాపై. కావాలని తనను బద్నాం చేస్తున్నారంటూ వాపోయారు. ఈ మధ్య కాలంలో గతంలో ఎన్నడూ లేనంతగా భారత క్రికెట్ జట్టు సెలక్షెన్ కమిటీ ఎంపికపై, ప్రధానంగా కోచ్ గా ఉన్న గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతగా ఫామ్ లేక పోయినా ఎందుకని శుబ్ మన్ గిల్ ను ఆడిస్తున్నారంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు ఫ్యాన్స్. జట్టు ఎంపిక ఎవరి మెప్పు కోసమో జరగదని , ఆ విషయం గుర్తించాలన్నారు. చాలా మంది ఆటగాళ్లను వారు ఆడిన ఆట తీరు కారణంగానే ఎంపిక చేస్తామన్నారు.
విచిత్రం ఏమిటంటే కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఫామ్ లో ఉన్నప్పటికీ తనకు ఛాన్స్ ఇవ్వక పోవడాన్ని ఎత్తి చూపారు. కొందరు క్రికెటర్లను కావాలని ఎంకరేజ్ చేయడం, మరికొందరిని డిస్కరేజ్ చేయడం పట్ల క్రికెటర్ వర్గాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. నిలదీసినంత పని చేశాయి గౌతమ్ గంభీర్ ను. కొందరికి అందలం ఎక్కించడం మంచి పద్దతి కాదని , ప్రతిభ కలిగిన , నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు ప్రయారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాడు గంభీర్. మీడియా అసలు వాస్తవాలను పట్టించుకోదంటూ ఆరోపించారు.


















