చండీగఢ్ : రేపిస్ట్ గురు గుర్మీత్ రామ్ రహీమ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తనకు ఇప్పుడు మరోసారి పెరోల్ లభించింది. 15వ సారి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా ఈ 40 రోజుల కాలంలో సింగ్ తన సిర్సాలోని డేరాలో ఉంటారని డేరా ప్రతినిధి, న్యాయవాది జితేందర్ ఖురానా తెలిపారు. డేరా సచ్చా సౌదా అధిపతిగా ఉన్నారు. తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అమాయక మహిళలను వేధింపులకు గురి చేశారన్న విమర్శలు ఉన్నాయి. పలు కేసులు నమోదయ్యాయి. ఆయనకు ఆయా పార్టీల మద్దతు ఉంది. దీంతో తనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష కోర్టు విధించింది. ఈ శిక్షణు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 2017లో దోషిగా నిర్ధారించబడినప్పటి నుండి 15వ సారి 40 రోజుల పెరోల్‌పై సోమవారం రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుండి బయటకు వచ్చారు.
16 సంవత్సరాల క్రితం జరిగిన ఒక జర్నలిస్టు హత్య కేసులో సింగ్‌తో పాటు మరో ముగ్గురికి కూడా 2019లో శిక్ష పడింది. తను చివరిసారిగా ఆగస్టు 2025లో 40 రోజుల పెరోల్‌పై జైలు నుండి బయటకు వచ్చారు. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అతనికి ఏప్రిల్ 2025లో 21 రోజుల పెరోల్ పై బయయటకు వచచ్చాడు. జనవరి 2025లో 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. అక్టోబర్ 5న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 1, 2024న అతను 20 రోజుల పెరోల్‌పై జైలు నుండి బయటకు వచ్చారు. ఆగస్టు 2024లో, సింగ్‌కు 21 రోజుల పే రోల్ లో మంజూరు చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు, ఫిబ్రవరి 7, 2022 నుండి అతనికి మూడు వారాల పే రోల్ రిలీజ్ చేశారు.



















