Gujarat : గుజరాత్ : గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్ ) కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నిన వారిని గుర్తించింది. ఆదివారం అహ్మదాబాద్ లో ఐఎస్ఐఎస్ తో సంబంధం ఉన్న ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకుంది. అరెస్టు చేయబడిన వ్యక్తులు గత ఏడాది కాలంగా తమ రాడార్‌లో ఉన్నారని తెలిపింది. వారు ఆయుధాలను సరఫరా చేసే ప్రక్రియలో ఉండగా అరెస్టు చేయడం జరిగిందని స్పష్టం చేసింది ఏటీఎస్. ఉగ్రవాదులు ఆయుధాలు మార్పిడి చేసుకోవడానికి గుజరాత్‌కు (Gujarat) వచ్చారని, దేశ వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో దాడులకు ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం తమకు అందిందని పేర్కొంది. అరెస్టు చేయబడిన ముగ్గురు అనుమానితులు రెండు వేర్వేరు మాడ్యూల్‌లకు చెందిన వారని పేర్కొంది ఏటీఎస్.
Gujarat ATS Shocking Comments
ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా ఇదే ఏడాది ప్రారంభంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా కు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసింది. వీరిలో విస్తు పోయే వాస్తవం బయట పెట్టింది. పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంబంధాలున్న ఆన్‌లైన్ టెర్రర్ మాడ్యూల్‌ను నిర్వహిస్తున్న బెంగళూరుకు చెందిన ఒక మహిళ కూడా ఉందని వెల్లడించింది ఏటీఎస్.
ఉగ్రవాదులను ఫర్దిన్ షేక్, సైఫుల్లా ఖురేషి, మొహమ్మద్ ఫైక్ , జీషన్ అలీగా గుర్తించారు . సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రాడికల్ భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలతో జూలై 22న వారిని అరెస్టు చేశారు.అరెస్టు చేసిన కీలక నిందితులలో ఒకరైన జీషన్ అలీ వద్ద నుండి అధికారులు అక్రమ సెమీ ఆటోమేటిక్ పిస్టల్, లైవ్ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Telangana Cyber Fraud Case Sensational : రూ. 95 కోట్ల సైబర్ మోసం బట్టబయలు(
















