తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీ

45 బంతుల్లో 101 ప‌రుగులు

hellotelugu-TilakVarma

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా మైదానంలోకి దిగింది ముంబై ఇండియ‌న్స్. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ గెలవక పోవ‌డంతో ఫ్యాన్స్ ఆశ‌లు వ‌దులుకున్నారు ఈ జ‌ట్టు ఆట‌తీరుపై. కానీ ఊహంచ‌ని విధంగా అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు హైద‌రాబాద్ కు చెందిన తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌. త‌ను క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ముంబై ఇండియ‌న్స్ టీం 199 ప‌రుగులు చేసింది.

అనంత‌రం 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్లు. ప్ర‌ధానంగా ఇంపాక్ట్ బౌల‌ర్ గా వ‌చ్చిన అశ్విన్ కుమార్ మిస్సైల్స్ లాంటి బంతుల‌తో ఆక‌ట్టుకున్నాడు. కేవ‌లం 4 ఓవ‌ర్ల‌లో 24 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చాడు. కీల‌క‌మైన నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ఆ జ‌ట్టు 100 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది . 15.5 ఓవ‌ర్ల‌లోనే ఆలౌటైంది. ఇక హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని ఝ‌ల‌క్ ఇచ్చింది ముంబై ఇండియ‌న్స్. మొత్తంగా ఈ విజ‌యంలో కీల‌క‌మైన పాత్ర పోషించాడు తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌. తను కేవ‌లం 45 బంతులు ఎదుర్కొని 101 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్స‌ర్ లు ఉన్నాయి.

 

 

 

 

Exit mobile version