న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. పరోక్ష పన్ను సంస్కరణలను ప్రశంసించారు, ఇటీవలి GST రేటు కోతల వల్ల కలిగే పన్ను ప్రయోజనాలను దేశంలోని సామాన్యులకు పూర్తిగా అందించామని అన్నారు. పరోక్ష పన్ను సంస్కరణలను ప్రశంసించారు, ఇటీవలి జీఎస్టీ రేటు కోతల వల్ల కలిగే పన్ను ప్రయోజనాలను దేశంలోని సామాన్యులకు పూర్తిగా అందించామని చెప్పారు. ప్రభుత్వం 54 రోజువారీ వినియోగ వస్తువుల రేటు తగ్గింపును నిశితంగా పర్యవేక్షిస్తోందని, భవిష్యత్తులో కూడా మరిన్ని వస్తువులను జోడించడం కొనసాగిస్తుందని ఆమె అన్నారు. అమెరికా సుంకాల బెదిరింపుల మధ్య, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రధాన దృష్టి కొనసాగుతున్న పండుగ అమ్మకాల ద్వారా వినియోగ డిమాండ్‌ను పెంచడం జరిగిందన్నారు.
GST 2.O సంస్కరణల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఫోకస్ పెడతామన్నారు. ఈ కొత్త తరం సంస్కరణ వినియోగదారుల ఆదాయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ లోకి రూ. 2 లక్షల కోట్లు వచ్చేలా చేసిందన్నారు. ఆదివారం దేశ రాజధానిలో జరిగిన జీఎస్టీ బచత్ ఉత్సవ్ 2025 సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర వాణిజ్య , పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీఎస్టీ సంస్కరణల ప్రభావాన్ని కూడా ప్రస్తావించారు. జీఎస్టీ రేటు కోతలు, వినియోగదారులకు అందించాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన భవిష్యత్తు చర్యల గురంచి హామీ కూడా ఇచ్చారు.
