Banakacherla : హైదరాబాద్ – తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు తూట్లు పొడిచే విధంగా ఏర్పాటు చేసిన బనకచర్ల (Banakacherla ) ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) షాక్ ఇచ్చింది. అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. గోదావరి, కృష్ణా జలాలు వృధాగా పోతున్నాయని, వాటిలోంచే తాము రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 200 టీఎంసీల నీళ్లను తీసుకు వెళతామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే గూటికి చెందిన వారు కావడంతో ఓకే కూడా చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Banakacherla Project – GRMB Object
కేంద్ర వాటర్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బనకచర్ల (Banakacherla) వివాదం మరింత రాజుకునేలా చేసింది. గులాబీ నేతలు కావాలని రాద్దాంతం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివని చెప్పారు. అయితే రెండు కళ్ల సిద్దాంతం పచ్చి మోసం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి. తాజాగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది జీఆర్ఎంబీ. బనకచర్ల నీటి మళ్లింపు తగదని స్పష్టం చేసింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది.
గోదావరి నదికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా ఇరు రాష్ట్రాలు ఒక ఒప్పందానికి రావాలని సూచించింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ), గోదావరి నదీ నిర్వహణ బోర్డు (జీఆర్‌ఎంబీ).
పోలవరం ప్రాజెక్టు నుండి రోజుకు 2 టీఎంసీల నీటిని బనకచర్లకు మళ్లిస్తే, ప్రాజెక్టు ప్రస్తుత ఆపరేషన్ మారే ప్రమాదం ఉందని పేర్కొంది. నీటి మళ్లింపులో మార్పులు చేయాలంటే మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో సంప్రదించి చేయాలని స్పష్టం చేసింది. అదనంగా 200 టీఎంసీల నీటిని మళ్లించాలనే ప్రస్తుత ప్రతిపాదన పోలవరం ప్రాజెక్టు కోసం ఆమోదించబడిన డీపీఆర్‌లో భాగం కాదని, ఈ మళ్లింపు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ నివేదికలో మాత్రమే చేర్చబడిందని తెలిపింది.
అదనపు నీటి మళ్లింపు కోసం 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) నిబంధనల ప్రకారం కొత్త డీపీఆర్ సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ . 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాలకు సంబంధించి ఎలాంటి అధికారిక పంపిణీ జరగలేదని, CWC దీనిని గమనించాలని జలశక్తి మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది.
Also Read : Bhumana Strong Reaction : బండి కామెంట్స్ భూమన స్ట్రాంగ్ కౌంటర్
















