‘టాక్సిక్’ మూవీ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు స‌ర్కార్ ఓకే

సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి 10 రోజుల దాకా

hellotelugu-ToxicMovie

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాన్ ఇండియా స్టార్ హీరో య‌ష్ కీల‌క పాత్ర పోషించిన చిత్రం టాక్సిక్. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి, ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్. భారీ ఖ‌ర్చుతో దీనిని రూపొందించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 26న బుధ‌వారం విడుద‌ల కానుంది. ఇదిలా ఉండ‌గా టాక్సిక్ మూవీ కోసం య‌ష్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని నాలుగు ఏళ్ల నుంచి తీస్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌కురాలు. ఎట్ట‌కేల‌కు ఇది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉండ‌గా యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. సవరించిన టికెట్ ధరలు సినిమా విడుదలైనప్పటి నుండి 10 రోజుల పాటు అమలులో ఉంటాయి.

ఇక టాక్సిక్ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ వంటి ప్రముఖ తారాగణం ఉంది. దీనిని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొని ఉన్నాయి. యష్ అభిమానులే కాకుండా సాధారణ సినీ ప్రేమికులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) ప్రకారం పెంచిన టికెట్ ధరలు రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తిస్తాయి. సింగిల్-స్క్రీన్ థియేటర్లు జీఎస్టీతో కలిపి అదనంగా రూ. 50 వసూలు చేయవచ్చు. అలాగే మల్టీప్లెక్స్‌లు , ప్రత్యేక థియేటర్లు జీఎస్టీతో కలిపి అదనంగా రూ. 100 వసూలు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది స‌ర్కార్. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ కమిటీ’ ఖాతాకు కేవీఎన్ -మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ తప్పనిసరిగా రూ. 1 కోటి విరాళం ఇవ్వాలని కూడా ఆ ఉత్తర్వులో ఆదేశించారు.

Exit mobile version