ముంబై : భారత దేశంలో అత్యంత విశ్వసనీయమైన, నమ్మకమైన సంస్థగా గ్రూపుగా పేరు పొందింది టాటా గ్రూపు. ఏకంగా రూ. 9 లక్షల కోట్ల విలువైనదిగా ప్రస్తుతం మార్కెట్ లో గుర్తింపు ఉంది. కాగా ఈ సంస్థను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ దేశంలో దాతృత్వాన్ని చాటు కోవడంలో, విరాళాలను అందించడంలో కంపెనీలు అన్నిటికంటే ముందంజలో ఉంటూ వచ్చింది. విశ్వనీయత, నిజాయితీ, నిబద్దత, నాణ్యత , మానవత అనే కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు కొన్నేళ్ల పాటు టాటా గ్రూప్ కొనసాగుతూ వచ్చింది. వ్యాపార దిగ్గజం రతన్ టాటా చని పోయాడో ఆనాటి నుంచి టాటా సంస్థల్లో వివాదాలు చెలరేగడం విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం అపూర్వమైన పాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
టాటా సన్స్‌లో 66% (26 లిస్టెడ్ కంపెనీలకు మాతృ సంస్థ) కలిగి ఉన్న టాటా ట్రస్ట్‌లు, వివాదాస్పద ట్రస్టీ పునః నియామకం తర్వాత నోయెల్ టాటా, మెహ్లి మిస్త్రీ నేతృత్వంలోని వర్గాలుగా విడి పోయాయి. కేంద్ర హోం, ఆర్థిక మంత్రులు జోక్యం చేసుకుని, టాటా వారసత్వం, జాతీయ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ గందరగోళం 2016 సైరస్ మిస్త్రీ ఎపిసోడ్‌ను ప్రతిధ్వనిస్తుంది, వారసత్వం , నియంత్రణ లోతుగా పాతుకుపోయిన సమస్యలను వెల్లడిస్తుంది.షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తన 18% వాటా నుండి నిష్క్రమించడానికి ప్రయత్నించడం .లిస్టింగ్ నిబంధనలపై RBI పరిశీలనతో, అనిశ్చితి తలెత్తుతోంది. మార్కెట్లకు అతీతంగా, సంక్షోభం టాటా విస్తారమైన దాతృత్వ పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తోంది.



















