Google : అమెరికా – ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ మరో కొత్త టూల్ ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా గూగుల్ వియో 3 ఏఐ వీడియో టూల్ ను ఆవిష్కరించింది. దీనిని ప్రతి ఒక్కరు ఉచితంగా ఉపయోగించు కోవచ్చని తెలిపింది గూగుల్. ఎలాంటి కెమెరా, సిబ్బంది లేకుండానే మీకు తోచే ఆలోచనలకు రెక్కలు తొడిగేందుకు, అద్భుతమైన వీడియోలు తీసేందుకు ఈ టూల్ కీలకంగా ఉంటుందని స్పష్టం చేసింది. గూగుల్ లో ఇప్పటి వరకు శక్తివంతమైన ఏఐ టూల్ ఇది అని పేర్కొంది.
Google Release New AI
ప్రపంచంలో మొదటగా అమెరికాలో ప్రయోగించడం జరిగిందని, అనూహ్యమైన స్పందన లభించిందని తెలిపారు గూగుల్ (Google) సీఈఓ సుందర్ పిచాయ్. ఆయన సంస్థను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా భారత దేశంలో వియో -3 ఏఐ వీడియో టూల్ ను ఆవిష్కరించామన్నారు. మొదట Google I/O 2025లో ఆవిష్కరించిన వియో 2 టెక్స్ట్ , ఇమేజ్ ప్రాంప్ట్ లను ఈ టూల్ ను ఉపయోగించుకుని హై డెఫిషీయన్సీ వీడియోలుగా మార్చేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫెక్టులు , ఏఐ జనరేటెడ్ వాయిస్ ఓవర్ లతో తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
వియో -3 అనేది గూగుల్ కు సంబంధించిన ఫ్లాగ్ షిప్ ఏఐ వీడియో మోడల్. రాత పూర్వక వివరణలు లేదా దృశ్య సూచనల వంటి సాధారణ ఇన్ పుట్ ల నుండి చిన్న వీడియోలను రూపొందించేందుకు టూల్ గా ఉపయోగ పడుతుంది.
Also Read : India 3rd Largest : మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్


















