ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఖుష్ క‌బ‌ర్

తెలంగాణ నుండి 8 కొత్త రైలు స‌ర్వీసులు

hellotelugu-SCRNewTrains

హైద‌రాబాద్ : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు నిత్యం వివిధ ప్రాంతాల‌కు ప్ర‌యాణం చేసే ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది. తెలంగాణ నుండి 8 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది . ఈ వారపు రైళ్లు కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుండి తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి నగరాలకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అనుసంధానాన్ని మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కొత్త రైలు సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధమైంది. తెలంగాణ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ స‌ర్వీసులు ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని దక్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది.

ఈ విష‌యాన్ని కేంద్ర బొగ్గు గ‌నుల‌ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ వారపు రైళ్లు కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుండి తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్ మరియు శ్రీ గంగానగర్ వంటి నగరాలకు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఇది అత్యంత హర్షణీయమైన పరిణామమని, ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే భక్తులకు , ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా గణనీయమైన చర్యలు తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అలాగే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు తెలంగాణ ప్రజల తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నట్లు వెల్ల‌డించారు.

Exit mobile version