Gold : భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, గ్లోబల్ ఆర్థిక ఒత్తిడుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల బంగారం (Gold), వెండి ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరాయి. నిత్యం పెరుగుతున్న ధరకార్యక్రమం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజా మార్కెట్ వివరాల ప్రకారం, సోమవారం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పెరిగి రూ.1,25,400 కి చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం రూ.300 పెరిగి రూ.1,14,950 గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.240 పెరిగి రూ.94,050కి చేరింది.
వెండి ధరల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది. కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగి రూ.1,85,000కి చేరింది.
Gold – తెలుగు రాష్ట్రాల్లో ధరలు:
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,400 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,14,950గా ఉంది. వెండి కిలో ధర లక్షా 95 వేల రూపాయలకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా సమానమైన ధరలే నమోదయ్యాయి – 24 క్యారెట్ల బంగారం రూ.1,25,400, 22 క్యారెట్ల బంగారం రూ.1,14,950, వెండి కిలో రూ.1,85,000.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు ప్రతి నగరంలో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు, అలాగే అంతర్జాతీయ బులియన్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు మారుతుంటాయి.
బులియన్ నిపుణులు చెబుతున్నట్లుగా, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు బంగారం ధరలకు మరింత మద్దతు ఇస్తున్నాయి. తద్వారా రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Also Read : Today Gold Price : నేడు పసిడి ధరలకు రెక్కలు



















