Gold : బంగారం ధరల ఎగబాకుడు కొనసాగుతోంది. పండగ సీజన్ నేపథ్యంలో పసిడి మార్కెట్‌లో రికార్డులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ కొత్త గరిష్ఠాలను తాకుతున్న బంగారం ధరలు మంగళవారం మరింత పెరిగాయి.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.1,23,850కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,500గా నమోదైంది. అలాగే కిలో వెండి ధర రూ.1,54,350కు పెరిగింది.
Gold – ధరల పెరుగుదల వెనుక కారణాలు
పండగల సీజన్‌లో ఆభరణాల కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత కొనసాగడం, అలాగే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే క్షీణించడం వంటి అంశాలు బంగారం ధరలను పైకి నెడుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లుతున్నారు.
ఇంకా పెరిగే అవకాశం
నిపుణుల అంచనాల ప్రకారం, బంగారం ధరలు సమీప రోజుల్లో మరింత ఎగబాకే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండటంతో పాటు దేశీయంగా పండగల సీజన్ కొనసాగే అవకాశం ఉండటంతో పసిడి పరుగులు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు వెండి ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రూ.1.5 లక్షల మార్క్ దాటిన వెండి ధర, త్వరలోనే రూ.2 లక్షల కిలో ధరను చేరే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : Trump Tariffs Sensational : నవంబర్ 1 నుంచి వాటిపై కూడా 25% సుంకాలు



















