Gold : అమెరికా మరియు చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు బంగారం, వెండి ధరలను కొత్త గరిష్ఠ స్థాయులకు చేర్చాయి. మంగళవారం ఉదయం (6.30 గంటల సమయానికి) దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం (Gold) ధర ₹1,25,410కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర ₹1,14,960గా, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర ₹94,060గా నమోదైంది.
వెండి ధరలు కూడా అదే దూకుడు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర ₹1,85,100గా ఉంది.
అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు చరిత్రాత్మక స్థాయికి చేరాయి. సోమవారం తొలిసారిగా ఔన్సుకు 4,100 డాలర్ల మార్కును బంగారం దాటింది. నిపుణుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలు పెట్టుబడిదారుల్లో భయాందోళనలకు దారితీశాయి. దీని ఫలితంగా భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది.
అదనంగా, అమెరికా డాలర్ విలువ 2025లో ఇప్పటివరకు సుమారు 10 శాతం తగ్గడం కూడా బంగారం, వెండి ధరలను మరింత పెంచిన అంశంగా నిపుణులు గుర్తిస్తున్నారు. పెట్టుబడిదారులు ప్రస్తుతం విలువైన లోహాల వైపు మళ్లుతున్నారు.
Gold – వివిధ నగరాల్లో బంగారం ధరలు (24K, 22K, 18K):
చెన్నై: ₹1,26,340; ₹1,15,810; ₹95,710
ముంబై: ₹1,25,410; ₹1,14,960; ₹94,060
ఢిల్లీ: ₹1,25,560; ₹1,15,110; ₹94,210
కోల్‌కతా: ₹1,25,410; ₹1,14,960; ₹94,060
బెంగళూరు: ₹1,25,410; ₹1,14,960; ₹94,060
హైదరాబాద్: ₹1,25,410; ₹1,14,960; ₹94,060
కేరళ: ₹1,25,410; ₹1,14,960; ₹94,060
పూణె: ₹1,25,410; ₹1,14,960; ₹94,060
వడోదరా: ₹1,25,460; ₹1,15,010; ₹94,110
అహ్మదాబాద్: ₹1,25,460; ₹1,15,010; ₹94,110
వెండి ధరలు (కిలోకు):
చెన్నై: ₹1,97,100
ముంబై: ₹1,85,100
ఢిల్లీ: ₹1,85,100
కోల్‌కతా: ₹1,85,100
బెంగళూరు: ₹1,85,100
హైదరాబాద్: ₹1,97,100
కేరళ: ₹1,97,100
పూణె: ₹1,85,100
వడోదరా: ₹1,85,100
అహ్మదాబాద్: ₹1,85,100
ఈ ర్యాలీ కొనసాగితే, రాబోయే వారాల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : Today Gold Price : నేడు భారీగా పెరిగిన పసిడి ధరలు



















