Gold : దేశంలో బంగారం, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. జులై 27 ఉదయం గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.540 తగ్గి ₹99,930కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,600గా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.1,900 తగ్గి పలుచోట్ల రూ.1,16,000 నుండి ₹1,26,000 మధ్య పలుకుతోంది.
Gold – ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్:
▪ 24 క్యారెట్ల బంగారం – ₹99,930
▪ 22 క్యారెట్ల బంగారం – ₹91,600
▪ వెండి (1 కిలో) – ₹1,26,000
ముంబై, బెంగళూరు:
▪ బంగారం – ₹99,930 (24K), ₹91,600 (22K)
▪ వెండి – ₹1,16,000
ఢిల్లీ:
▪ బంగారం – ₹1,00,080 (24K), ₹91,750 (22K)
▪ వెండి – ₹1,16,000
చెన్నై:
▪ బంగారం – ₹99,930 (24K), ₹91,600 (22K)
▪ వెండి – ₹1,26,000
ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు:
- గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ బలపడటం
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు
- భౌగోళిక రాజకీయ అస్థిరత
- పారిశ్రామిక డిమాండ్ తగ్గడం (వెండి ధరపై ప్రభావం)
ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటను కలిగించగా, రానున్న రోజుల్లో గోల్డ్ రేట్ ఎలా మారుతుందో అనే ఆసక్తి మార్కెట్‌లో నెలకొంది.
గమనిక: పై ధరలు స్థానిక పన్నులు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా మారవచ్చు.
Also Read : Today Gold Price : నెమ్మ నెమ్మదిగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు
