Gold : దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోలు దారులకు ఊరట కలిగించే పరిణామం జూలై 30, 2025న కనిపించింది. బంగారం ధరలు నిన్నటి కంటే కొంత తగ్గిపోయాయి, అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం 6:10 గంటల వరకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.1,15,900 వద్ద స్థిరంగా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళ, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లో కూడా బంగారం ధరలు హైదరాబాద్ సరసంగా ఉండగా, చెన్నైలో వెండి ధర కిలోకు రూ.1,25,900గా నమోదు కావడం విశేషం.
Today Gold Price Updates
బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటం వలన బంగారం సురక్షిత పెట్టుబడిగా మారడంతో కొనుగోలు వృద్ధి చెందుతోంది. ఇది ధరలను తగ్గించే దిశగా ప్రభావం చూపుతోంది. ధరలు బులియన్ మార్కెట్ ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, వినియోగదారులు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకుంటే తాజా ధరకానులను పరిశీలించి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : రోజురోజుకు పతనమవుతూ వస్తున్న పసిడి ధరలు



















