Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు

రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడటమూ బంగారం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడటమూ బంగారం (Gold) ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజు (సెప్టెంబర్ 25) దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,360కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,05,740గా నమోదైంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,15,510, 22 క్యారెట్ల ధర రూ. 1,05,890గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,360 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,05,740గా ఉంది. వడోదరలో మాత్రం కొద్దిగా ఎక్కువగా 24 క్యారెట్ల ధర రూ. 1,15,410, 22 క్యారెట్ల ధర రూ. 1,05,790గా నమోదైంది.

Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

ప్రస్తుతం బంగారం రేట్లు ఎగిసిపోతుండగా, వెండి ధరలు మాత్రం నిన్నటితో పోల్చితే కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి.

Also Read : Today Gold Price : బంగారం, వెండి ధరలు పెరుగుదల – ప్రధాన నగరాల్లో తాజా రేట్లు

Exit mobile version