Gold : శ్రావణ మాసం ప్రారంభమవడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, బంగారం కొనుగోలు చేసే వారికి ఇది స్వల్పంగా నిరాశ కలిగించే విషయం. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారానికి (Gold) భారతీయుల మక్కువ ఎంత ఎక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ప్రాణం. ప్రతి శుభకార్యంలోనూ బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ధరల పెరుగుదల సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పసిడి రేటు లక్ష రూపాయల మార్కును అధిగమించింది.
Gold – తాజా ధరల వివరాలు:
2025 ఆగస్టు 8 నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,560గా ఉంది. ఇదే రోజు 22 క్యారెట్ల ధర రూ.94,010గా నమోదైంది. గత వారం రోజు (ఆగస్టు 7)తో పోలిస్తే ఈ ధరలు రూ.10 వరకు పెరిగినట్లు గమనించవచ్చు.
ప్రాంతాల వారీగా ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్:
24 క్యారెట్ల బంగారం: ₹1,02,560
22 క్యారెట్ల బంగారం: ₹94,010
కిలో వెండి ధర: ₹1,27,000
విజయవాడ & విశాఖపట్నం:
24 క్యారెట్ల బంగారం: ₹1,02,560
22 క్యారెట్ల బంగారం: ₹94,010
కిలో వెండి ధర: ₹1,20,000
వరంగల్:
24 క్యారెట్ల బంగారం: ₹1,02,560
22 క్యారెట్ల బంగారం: ₹94,010
కిలో వెండి ధర: ₹1,27,000
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఎప్పటికప్పుడు ధరల మార్పులు చోటుచేసుకుంటుండటంతో కొనుగోలుదారులు ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : రోజురోజుకి సాధారణ మానవుడికి అందనంత స్థాయికి పసిడి ధరలు



















