Gold : వినాయక చవితి పండుగ సమీపిస్తుండగా బంగారం ధరలు మరల పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. గడచిన ఐదు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,600 వరకు పెరగగా, 22 క్యారెట్ల ధర రూ.1,500 మేరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన అనిశ్చితులు, అమెరికా వాణిజ్య విధానాలు, భారత్‌పై ప్రభావం చూపిన అదనపు సుంకాలు వంటి అంశాలు బంగారం రేట్ల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Gold – ప్రధాన నగరాల్లో ధరలు
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,220, 22 క్యారెట్ల ధర రూ.93,710.
- చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,070, 22 క్యారెట్ల ధర రూ.93,560.
వెండి ధరలు తగ్గుముఖం
బంగారం ధరలు ఎగబాకుతుండగా వెండి మాత్రం విరుద్ధ దిశగా కదులుతోంది. గత రెండు రోజుల్లో కిలో వెండి ధర సుమారు రూ.1,100 మేరకు తగ్గింది.
- ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు: కిలో వెండి ధర రూ.1,19,900.
- హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ: కిలో వెండి ధర రూ.1,29,900.
గమనిక
పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటల సమయానికి నమోదైనవి. ఆ తర్వాతి ట్రేడింగ్ పరిస్థితుల ఆధారంగా మార్పులు చోటు చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read : Huge Gold Seized : గడిచిన 10 ఏళ్లుగా వేల కేజీల బంగారాన్ని సీజ్ చేసిన కేంద్ర సర్కార్



















