Gold : బంగారం, వెండి ధరల్లో ఇటీవల కాలంగా మార్పులు గమనించబడుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల మనోభావాలు, డాలర్ వ్యాల్యూలో మార్పులు వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీయంగా మంగళవారం నాడు బంగారం (Gold) ధరలు వరుసగా ఐదో రోజు తగ్గాయి. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా పడిపోయింది.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.99,920గా నమోదైంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద ఉంది. ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.
Gold – నగరాల వారీగా బంగారం ధరలు:
హైదరాబాద్: 24 క్యారెట్లు – ₹99,920 | 22 క్యారెట్లు – ₹91,590
ముంబయి: 24 క్యారెట్లు – ₹99,920 | 22 క్యారెట్లు – ₹91,590
విజయవాడ: 24 క్యారెట్లు – ₹99,920 | 22 క్యారెట్లు – ₹91,590
చెన్నై: 24 క్యారెట్లు – ₹99,920 | 22 క్యారెట్లు – ₹91,590
బెంగళూరు: 24 క్యారెట్లు – ₹99,920 | 22 క్యారెట్లు – ₹91,590
వెండి ధరలు:
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,15,900గా ఉంది. అయితే కొన్ని ఇతర ప్రాంతాల్లో ఈ ధర రూ.1,25,000 వరకు ఉన్నట్లు సమాచారం.
ధరల తగ్గుదలకు కారణాలు ఏమిటి?
బంగారం, వెండి ధరల తగ్గుదలకు అనేక దేశీయ మరియు అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం అవలంబిస్తున్న వాణిజ్య విధానాలు, వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రేడింగ్ వాతావరణం, పెట్టుబడిదారుల భవిష్యత్ అంచనాలు వంటి అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, వరుసగా ధరలు తగ్గుతున్నప్పటికీ బంగారం ధర రూ.లక్షకు దగ్గరగా ఉండటం గమనార్హం. దీని వలన ప్రస్తుతం వినియోగదారులు కొనుగోళ్లలో వెనుకంజ వేస్తున్నారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారుల దృష్టిలో బంగారం ఇప్పటికీ ఒక భద్రమైన పెట్టుబడి ఎంపికగా కొనసాగుతోంది.
ధరల్లో ఈ మార్పులు కొనసాగతాయా లేక తిరిగి పెరుగుతాయా అన్నదానిపై రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులు స్పష్టత ఇవ్వనున్నాయి.
Also Read : Today Gold Price : భారీ రేట్ల నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు



















