Gold : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది శుభవార్త. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడవ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా బంగారం (Gold) ధరల తగ్గుదల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ప్రస్తుతం ఇది అనుకూల సమయంగా పరిగణించవచ్చు.
ప్రపంచ స్థాయిలో పెట్టుబడిదారులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నిర్ణయాలు, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను గమనిస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో ఉన్న అనిశ్చితి ప్రభావం బంగారం, వెండి ధరలపై కూడా పడుతోంది. స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్లలో ఉన్న హెచ్చుతగ్గుల మధ్య బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా ధరలు పడిపోయాయి.
గత కొన్ని రోజులుగా బంగారంతో పాటు వెండి ధరలూ తగ్గుతూ వస్తున్నాయి. గురువారం కూడా ఈ ట్రెండ్ కొనసాగింది.
Gold – ప్రస్తుత బంగారం ధరలు (పది గ్రాములకు):
ఢిల్లీ:
24 క్యారెట్లు – ₹1,00,290
22 క్యారెట్లు – ₹91,940
ముంబై:
24 క్యారెట్లు – ₹1,00,140
22 క్యారెట్లు – ₹91,790
చెన్నై:
24 క్యారెట్లు – ₹1,00,140
22 క్యారెట్లు – ₹91,790
బెంగళూరు:
24 క్యారెట్లు – ₹1,00,140
22 క్యారెట్లు – ₹91,790
హైదరాబాద్:
24 క్యారెట్లు – ₹1,00,140
22 క్యారెట్లు – ₹91,790
విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్లు – ₹1,01,180
22 క్యారెట్లు – ₹92,750
వెండి ధరలు:
గ్రాము వెండి ధర – ₹124.90
కిలో వెండి ధర – ₹1,24,900
పసిడి ధరలు తగ్గుతున్న ఈ సమయంలో కొనుగోలుదారులు తమ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే, ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావంతో ధరల్లో మార్పులు సహజమేనని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Huge Gold Deposits : ఒడిశా పలు జిల్లాల్లో భారీగా బంగారు నిల్వలు
