Gold : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతుండటంతో పాటు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారానికి (Gold) డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. అంతేకాక, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే క్షీణించడం కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అక్టోబర్ 11 నాటికి, దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,23,700కు చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 1,13,390గా ఉంది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
- హైదరాబాద్: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
- విజయవాడ: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
- ఢిల్లీ: 24 క్యారెట్ – ₹1,23,850 | 22 క్యారెట్ – ₹1,13,540
- ముంబై: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
- వడోదర: 24 క్యారెట్ – ₹1,23,750 | 22 క్యారెట్ – ₹1,13,440
- కోల్‌కతా: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
- చెన్నై: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
- బెంగళూరు: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
- కేరళ: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
- పుణే: 24 క్యారెట్ – ₹1,23,700 | 22 క్యారెట్ – ₹1,13,390
వెండి ధరలు (కిలోకు):
- హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ: ₹1,84,100
- ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్: ₹1,74,100
మొత్తంగా, వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే రూ. 100 మేర పెరిగాయి.
Also Read : Today Gold Price : పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి మాత్రం మండుతుంది



















