Goenka Group : విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వం విశాఖ వేదికగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కీలకంగా మారింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి. దేశ, విదేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, యజమానులు, మేనేజింగ్ డైరెక్టర్లు కీలకమైన చర్చలు జరిపారు. ఈ సమ్మిట్ లో పేరొందిన గోయెంకా గ్రూప్ (Goenka Group) నకు చెందిన వైస్ చైర్మన్ సంజీవ్ గోయెంకా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధనం, ఐటీ, రసాయనాలు, పెద్ద ఎత్తున FMCG , వినోదం, క్రీడా మౌలిక సదుపాయాలలో అవకాశాల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగిందన్నారు.
Goenka Group Vice Chairman Meet
ఇలాంటి చర్చలు నిర్దిష్ట పెట్టుబడులుగా మారేందుకు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. అవకాశాలను ఆకర్షించడమే కాకుండా వాటిని తన వృద్ధి కథను పునర్నిర్వచించుకునే పరిశ్రమలుగా రూపాంతరం చెందుతాయని పేర్కొన్నారు సీఎం. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఏపీ సర్కార్ 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా తాము ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఏపీలో దాదాపు లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : I Bomma Owner Shocking : ఐ బొమ్మ యజమాని ఇమ్మడి రవి అరెస్ట్
















