Supreme Court : ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంస్థకు చెందిన మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలతో పాటు మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో. ఈ సందర్బంగా సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది ధర్మాసనం. కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ హైకోర్టులో ఉండగా ఇక్కడి దాకా ఎందుకు వచ్చారంటూ సీరియస్ గా ప్రశ్నించింది. స్టే ఇవ్వక పోతే ఇక్కడికి వచ్చేస్తే ఎలా అని నిలదీసింది. హైకోర్టులో విచారణలో ఉండగా పిటిషన్ స్వీకరించ లేమంటూ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టులో (Supreme Court) సుదీర్ఘ విచారణ జరిగింది.
Supreme Court Key Comments on BC Reservations
హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు సిద్దార్ధదవే, అభిషేక్ సింఘ్వీ, ఎడిఎన్ రావు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించింది జస్టిస్ విక్రంనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం. దీంతో పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు మరో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని, అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది.
Also Read : Sachin Tendulkar Interesting Comments : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను ప్రశంసించిన సచిన్
















