ముంబై : భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్, శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ కొనసాగుతోంది. భారత్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లలో గెలుపొందగా అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా చేతిలో దారుణంగా ఓటమి పాలైంది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను, టీం మేనేజ్మెంట్ ను తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ తరుణంలో జహీర్ ఖాన్ స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితిలో సంజు శాంసన్ ను ఎందుకు పక్కన పెడుతున్నారంటూ ప్రశ్నించాడు. రింకూ సింగ్ స్థానంలో తనను తీసుకుంటే బావుండేదని సూచించాడు. తనను కాకుండా బెటర్ ఛాయిస్ కేవలం కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ మాత్రమేనని పేర్కొన్నాడు.
రింకూ సింగ్ కు అంతర్జాతీయ పరంగా టాప్ బౌలర్లను ఎదుర్కొనే సత్తా లేదన్నాడు. ఇదే క్రమంలో సంజు శాంసన్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉందని అందుకే తనను ఓపెనర్ గా నైనా లేదా ఏ ప్లేస్ లోనైనా తీసుకుంటే బావుంటుందని సూచించాడు జహీర్ ఖాన్. మాజీ క్రికెటర్లు సైతం పెద్ద ఎత్తున మండి పడుతున్నారు గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై. ఎప్పుడైనా హెడ్ కోచ్ జట్టుకు బలంగా ఉండాలే తప్పా అనవసర ప్రయోగాలకు వేదిక కాకూడదంటూ పేర్కొన్నాడు జహీర్ ఖాన్.
