ముంబై : స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇవాళ ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. దీనిపై స్పందించాడు మాజీ క్రికెటర్. ఇది పూర్తిగా ఆలోచించాల్సిన విషయమని, అహాన్ని కాపాడుకునే సమయం కాదన్నాడు. ప్రపంచ కప్ ను మరోసారి చేజిక్కించు కోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు. ఈ డూ-ఆర్-డై ఘర్షణలో అభిషేక్ శర్మకు విరామం ఇవ్వాలని సూచించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇదే సమయంలో సంజు సామ్సన్‌ను విశ్వసించాలని స్పష్టం చేశాడు.
మూడవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను, నాలుగో స్థానంలో తిలక్ వర్మను ఆడించాలని పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. బౌలర్లు, పరిస్థితుల ఆధారంగా కుడి-ఎడమ సమతుల్యతను కొనసాగించాలని స్పష్టం చేశాడు. మ్యాచ్ పరంగా చూస్తే రెండు ప్రారంభ వికెట్లు కూలిపోవడం కాదు . ఇది ఫార్మాట్‌లో భాగం. మరింత బాధించేది సంకోచం. ఆటగాళ్ళు పరుగులు చేయడం కంటే అవుట్ అవ్వడం గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు, ప్రత్యర్థి కంటే ముందు ఒత్తిడి గెలుస్తుందన్నాడు సెహ్వాగ్. ధైర్యవంతమైన క్రికెట్ ఆడాలని, అతిగా ఆలోచించడం మానేయాలని సూచించాడు.

















