Harish Rao : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ పూర్తిగా పక్షపాతంగా ఉందని, ఇది కేవలం సర్కార్ కు వంత పాడేలా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. సుప్రీంకోర్టు సైతం అద్భుతమైన ప్రాజెక్టు అంటూ కితాబు ఇచ్చిందని, కానీ కావాలని దుష్ప్రచారం చేసి, పవర్ లోకి కాంగ్రెస్ వచ్చిందంటూ ధ్వజమెత్తారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఇవాళ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
Harish Rao Slams Ghosh Report
ఇదిలా ఉండగా తుది తీర్పు వచ్చే వరకు ప్రభుత్వం తీర్పులపై చర్య తీసుకోకుండా నిరోధించాలని కోర్టును కోరామన్నారు. ఈమేరకు హైకోర్టులో ఇంటర్‌లోక్యుటరీ అప్లికేషన్ (IA) దాఖలు చేశానని తెలిపారు.. 15 నెలల విచారణ తర్వాత సమర్పించిన నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం ,సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో స్పష్టమైన అవకతవకలను ఎత్తి చూపిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు హరీశ్ రవు. కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించినప్పటికీ, కమిషన్ కనుగొన్న వాటి ఆధారంగా ప్రతివాదులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిరోధించాలని హరీష్ రావు తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. రిట్ పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పు వెలువరించే వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఆయన కోరారు.
Also Read : KTR Interesting Comments on Maganti : గోపన్న నిజమైన ప్రజా నాయకుడు : కేటీఆర్

















