Garuda Vahanam : తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై (Garuda Vahanam) భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని దర్శించుకున్నారు.
Garuda Vahanam Interesting Updates
గరుడ సేవ (Garuda Vahanam) రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నపుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు. గరుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారు, అమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్ష స్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియ జేస్తున్నాయి. జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, పనబాక లక్ష్మి, సాంబశివరావు, జానకి దేవి, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, శ్రీనివాస చార్యులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read : CM Revanth Important Comments on Ande Sri : ముక్కోటి గొంతుకలను ఏకం చేసిన కవి అందెశ్రీ



















