Sanju Samson : హైదరాబాద్ : ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టి20 ఫార్మాట్ కు ఎంపికైన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కొనసాగుతున్నాయి జట్టు హెడ్ కోచ్ గంభీర్ పై. 5 టి20 సీరీస్ లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో సంజూ శాంసన్ (Sanju Samson) ను ఆడించక పోవడం పట్ల మండిపడుతున్నారు ఫ్యాన్స్. 1,2 మ్యాచ్ లలో ఆడేందుకు ఛాన్స్ రాలేదు. తను ఆడిన ఒక్క మ్యాచ్ లో 2 రన్స్ చేయడంతో పక్కన పెట్టేశాడు గంభీర్. అదే శుభ్ మన్ గిల్ ను కంటిన్యూ ఆడిస్తూ వస్తున్నాడు. తను వరుసగా విఫలం అయినా ఎంపిక చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు . అయినా డోంట్ కేర్ అంటున్నాడు హెడ్ కోచ్.
Sanju Samson-Gambhir Issue
తను మొదటి నుంచి అంతే . ఇదే సమయంలో బీసీసీఐ కూడా సంజూ శాంసన్ పట్ల వ్యతిరేక ధోరణితో ఉంది. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చివరకు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కే పరిమితం చేసేలా ఉన్నారు అందరూ కలిసి శాంసన్ ను. ప్రస్తుతం తను రాజస్తాన్ రాయల్స్ జట్టును వీడనున్నాడు. తనను తీసుకునేందుకు ఆయా జట్లు పోటీ పడుతున్నాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ గా తీసుకునేందుకు రెడీ అయినట్టు టాక్. ఇంతలోపు కనీసం ఒక్క మ్యాచ్ ను ప్రాతిపదికగా ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ వర్గాలు. అయినా గంభీర్ వినడం లేదు. ఏది ఏమైనా కెప్టెన్ అయిన సూర్య కుమార్ యాదవ్ సైతం మౌనంగా ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. తనను ఓపెనింగ్ కు పంపిస్తే బావుంటుందని సూచించినా పట్టించు కోవడం లేదు.
Also Read : Rahul Gandhi Shocking Comments : హర్యానాలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు


















