Gali Janardhan Reddy : హైదరాబాద్ – మైనింగ్ రారాజుగా పేరు పొందిన కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) మరోసారి సంచలనంగా మారారు. మంగళవారం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. విచిత్రంగా ఓ అంశాన్ని తెర పైకి తీసుకు వచ్చారు. తన కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా అన్యాయంగా ఉందని వాపోయారు. ఆపై ఆ తీర్పు రద్దు చేయాలని కోరుతూ తాజాగా హైకోర్టులో దావా దాఖలు చేశారు.
Gali Janardhan Reddy Alarming
ఇందుకు సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారించారు జస్టిస్ లక్ష్మణ్. ఓఎంసీ కేసులో భాగంగా గాలి, అతని కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు 58 కిలోల బంగారం, వజ్రా భరణాలను స్వాధీనం చేసుకున్నామని కోర్టులో ఇప్పటికే తెలిపింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇదే విషయాన్ని పూర్తి నివేదిక రూపంలో అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో తిరిగి కేసు మళ్లీ మొదటికి వచ్చింది. అయితే తమకు కొంత సమయం ఇవ్వాలని కోరింది సీబీఐ తరపు న్యాయవాది.
ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి లక్ష్మణ్ విచారణ చేపట్టిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ కు సంబంధించి తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంత లోపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించారు జస్టిస్ లక్ష్మణ్.
Also Read : HYDRA Shocking Elimination : ఆక్రమణలపై జూలు విదిల్చిన హైడ్రా
















