ముంబై : భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో జరగబోయే ఐపీఎల్ టోర్నీ కోసం ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున వేలం పాటలో ఆటగాళ్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉందన్నాడు. తన దృష్టిలో కొందరు ప్లేయర్లను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే మనోడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యంగ్ క్రికెటర్ సల్మాన్ నిజార్ గురించి. అంతే కాకుండా తనకు ఇష్టమైన మూడు ఐపీఎల్ జట్ల గురించి తెలిపాడు. ఇందులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఫ్రాంచైజీలు ఉన్నాయన్నాడు. జియోస్టార్ నిపుణులు ఐపీఎల్ మినీ-వేలానికి ముందు టాప్ అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల గురించి చర్చించారు.
యష్ ధుల్, సైరాజ్ పాటిల్, సల్మాన్ నిజార్, తుషార్ రహేజా సార్థక్ రంజన్‌లను హైలైట్ చేశారు ఆకాష్ చోప్రా. టాటా ఐపీఎల్ 2026 మినీ-వేలం పాటలో వీరందరూ దేశీయ లీగ్‌లలో ఆకట్టుకుంటారని చెప్పాడు. ‘టాటా ఐపీఎల్ వేలంలో గమనించదగ్గ టాప్ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్’ షోలో జియోస్టార్ నిపుణులు ఆకాష్ చోప్రా, సబా కరీం, అభినవ్ ముకుంద్ , రీమా మల్హోత్రా, సాయిరాజ్ పాటిల్‌తో కలిసి టాప్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను విశ్లేషించారు, యాష్ ధుల్ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. అతను త్వరలో భారతదేశం తరపున ఆడే యువకుడిగా ఆడడం ఖాయమన్నారు.


















