కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఈ సందర్బంగా స్పందించాడు భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ. ఈ సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గౌరవ కార్యదర్శి సైకియా సంచలన ప్రకటన చేశాడు. టీంఇండియా వరల్డ్ కప్ గెలుపొందడంతో భారీ నజరానా ప్రకటించారు. ఏకంగా భారత టీంకు ఏకంగా రూ. 131 కోట్లు నగదు బహుమతిని ప్రకటించింది. భారీ గిఫ్ట్ అందించడం ఆనందంగా ఉందన్నాడు. ఇది మంచి ప్రోత్సాహకాన్ని ఇస్తుందని చెప్పాడు.
తను మీడియాతో మాట్లాడాడు . ప్రత్యేకించి భారత జట్టుకు అభినందనలు. జట్టు సమిష్టిగా ఆడింది. ఇదే క్రమంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అని పేర్కొన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన తను ఊహించని రీతిలో అద్భుతమైన రీతిలో ఆడాడని ప్రశంసించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలవడం సంతోషం కలిగించిందని పేర్కొన్నాడు భారత జట్టు మాజీ స్కిప్పర్ సౌరవ్ గంగూలీ. తను ఆటగాడిగా కాకుండా ఛాంపియన్ గా ఆడాడని, కోట్లాది మందిని ప్రభావితం చేశాడని కితాబు ఇచ్చాడు. అయితే తన ప్రదర్శన తనకు ఆశ్చర్యాన్ని కలిగించ లేదన్నాడు. తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తనను తాను నిరూపించు కున్నాడని, ఇక అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు.



















