పాకిస్తాన్ : టెర్రరిజానికి , తీవ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్ లో ఇప్పుడు ఇండియా అంటేనే వణుకు పుడుతోంది. భారత సైనికులు, యుద్ద విమానాలు, ప్రభుత్వం అనుకుంటే పొరపాటు పడినట్లే. దీనికి ప్రధాన కారణం వేరే ఉంది. ఇండియాలో రూపుదిద్దుకున్న సినిమా. అదే బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీసిన దురంధర్ ది రివెంజ్ -2 సీక్వెల్ మూవీ. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోట్లు కురిపిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ. 2000 కోట్లు వసూలు చేయడం పక్కా అని ముందస్తు అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు.
ఇదిలా ఉండగా దురంధర్ మూవీ ఇప్పుడు దాయాది పాకిస్తాన్ దేశ ప్రభుత్వాన్ని, ఆర్మీని, అంతకు మించి ప్రజలను విస్తు పోయేలా చేస్తోంది. అంతకు మించి తీవ్ర భయాందోళకు గురి చేయడం విస్తు పోయేలా చేస్తోంది. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు .’ధురందర్’ సినిమా వచ్చిన తర్వాత, పాకిస్తాన్‌లో ఇకపై ఎవరినీ నమ్మలేమన్నాడు నేను ఎవరితో మాట్లాడినా, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నానని చెప్పాడు. ఎందుకంటే వారు బహుశా భారతీయ ఏజెంట్లు అయి ఉండవచ్చనే భావన కలుగుతోందన్నాడు. అందుకే, రోడ్డు పక్కన ఉండే బిచ్చగాళ్ల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరినీ వారు భారతీయ ఏజెంట్లా కాదా అని నిర్ధారించు కోవడానికి ప్రభుత్వం ఒక్కొక్కరిగా విచారించాలని నాకు అనిపిస్తోందన్నాడు.



















