RK Roja Shocking Comments : టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని క‌క్ష క‌ట్టారు

కేసుల‌కు భ‌య‌ప‌డ‌ను..కోర్టులో తేల్చుకుంటా

Hello Telugu - RK Roja Shocking Comments

Hello Telugu - RK Roja Shocking Comments

RK Roja : చిత్తూరు జిల్లా – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి షాకింగ్ కామంట్స్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేసింది. కూట‌మి స‌ర్కార్ ను క‌డిగేసింది. ప్ర‌త్యేకించి టీడీపీ గురించి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సోమ‌వారం ఆర్కే రోజా (RK Roja) మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైతే టీడీపీ నుంచి బయటికి వచ్చానో అప్పటి నుంచి నాపై కక్షగట్టారని ఆరోపించారు. అయినా కేసుల‌కు, అరెస్ట్ ల‌కు తాను భ‌య‌ప‌డే ర‌కం కాద‌న్నారు.

RK Roja Selvamani Shocking Comments

నేను వెళ్లడం వల్లే రాజశేఖర్ రెడ్డి చనిపోయారు, జగన్ జైలుకు పోయాడని ప్రచారం చేశార‌ని, కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. తాను మంత్రి కూడా అయ్యాన‌ని, దానికి కార‌కుడు జ‌గ‌న్ రెడ్డి అని పేర్కొన్నారు. కుట్ర‌ల‌కు, మోసాల‌కు కేరాఫ్ చంద్ర‌బాబు నాయుడు అని ఆరోపించారు.

లోకేశ్ పిల్లబిత్తిరే అని ఈ రోజుకీ చెప్తున్నానని అన్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు పని చేస్తున్నాడని ప్ర‌శ్నించారు. ఈ విష‌యం గురించి ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. మహిళలకు కష్టమొస్తే అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడని నిల‌దీశారు మాజీ మంత్రి. అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై తప్పుగా మాట్లాడ లేద‌న్నారు. భగవంతుడి మీద ప్రమాణం చేసి వైసీపీ నేతలు తప్పుగా మాట్లాడారని చంద్రబాబు చెప్పగలరా అని స‌వాల్ విసిరారు.

Also Read : Minister Anam Strong Focus : ఆల‌యాల అభివృద్దిపై ఆనం ఫోక‌స్

Exit mobile version