KTR : హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదని, పదేండ్ల అభివృద్ధి, పాలనకి రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని పేర్కొన్నారు. పదేండ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారని అన్నారు.
KTR Request
లక్షల మంది రైతన్నలు సైతం మాగంటి సునీత తప్పకుండా గెలుస్తుందని ఆశిస్తున్నారని చెప్పారు కేటీఆర్. తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతీ, యువకులు చూస్తున్నారని అన్నారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు చూస్తున్నారని స్పష్టం చేశారు. మూత పడుతున్న బస్తీ దవాఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్ట లేదని ఆరోపించార. కేసీఆర్ కట్టిన కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నగర ప్రజలకు గుర్తున్నాయని చెప్పారు.
Also Read : Minister Kandula Durgesh Interesting Update : ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు : కందుల దుర్గేష్
















