KTR : హైదరాబాద్ : రాష్ట్రంలో పని చేస్తున్న గిగ్ అండ్ ప్లాట్ ఫారమ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). తమకు న్యాయం చేయాలని టీజీపీడబ్ల్యూయు సభ్యులు కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో కలిశారు. ఈ సందర్బంగా వినతిపత్రం సమర్పించారు. తమ పట్ల సర్కార్ వివక్షను ప్రదర్శిస్తోందని వాపోయారు. వారి తరపున సర్కార్ ను నిలదీస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని కక్ష కట్టిందని మండిపడ్డారు. వీరి కుటుంబాలు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ పరిహారం ఇప్పటి వరకు అందలేదన్నారు.
KTR Slams Congress Govt
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించిన గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. మరణించిన గిగ్ వర్కర్స్ కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల పరిహారాన్ని చెల్లించడంతో పాటు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతేకాదు గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు కేటీఆర్. కేవలం ఓట్ల కోసం హామీలు ఇచ్చి విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటై పోయిందన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధితో ఉంటే గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
గిగ్ కార్మికుల సంక్షేమాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, వారి భద్రత, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ నైతిక, రాజకీయ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read : KTR Fired on Congress, BJP : రైతు ద్రోహి కాంగ్రెస్ ప్రజా ద్రోహి బీజేపీ
















