కేసీఆర్ ను అన‌డానికి ఎవ‌డివి రా నువ్వు

తొర్రూరు గడ్డపై నిప్పులు చెరిగిన కేటీఆర్

hellotelugu-KTR

వ‌రంగ‌ల్ జిల్లా : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేప‌ట్టారు. చంద్రబాబు సంచులు మోసిన చరిత్ర నీది రేవంత్ రెడ్డి అంటూ మండిప‌డ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని విమర్శించే స్థాయి నీకు ఉందా? సమైక్యవాదుల దగ్గర బ్రోకరిజం చేసిన నువ్వు ఇవాళ పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లంగ మాటలు నమ్మి మోసపోతే.. మళ్లీ లైన్లలో నిలబడే పాత రోజులే మిగిలాయని అన్నారు . వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నీకుంటదిరా పొట్టోడా అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.

తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు శాంతియుతంగా ఉద్య‌మం చేసి ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించిన అరుదైన నాయ‌కుడు కేసీఆర్ అని , ఆయ‌న ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన వ్య‌క్తి అని , త‌న గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేనే లేద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు సంచులు మోసిన బ్రోకర్ వి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావా అంటూ నిప్పులు చెరిగారు. సిట్ విచార‌ణ పేరుతో కాల‌యాప‌న చేయ‌డం, త‌మ‌ను ఇబ్బంది పెట్ట‌డం త‌ప్పితే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమీ లేద‌న్నారు కేటీఆర్. ఇక‌నైనా పాలన‌పై దృష్టి పెడితే చాల‌ని పేర్కొన్నారు.

Exit mobile version