Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయనకు సోయి లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్షాలను బూతులు తిట్టడం తప్ప రైతులను ఆదుకోవాలన్న ధ్యాస ఎక్కడుందని ప్రశ్నించారు హరీశ్ రావు. ఓ వైపు పత్తి, మొక్కజొన్న రైతులు నానా తంటాలు పడుతున్నారని వాపోయారు. వారికి భరోసా ఇవ్వాల్సిన సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అధిక వర్షాలు పడడంతో ఇప్పటికే పత్తి రైతులకు దిగుబడి తగ్గిందని, తీవ్రంగా నష్ట పోయారని అన్నారు.
Ex Minister Harish Rao Slams Congress Govt
ఉన్న పత్తిని కొనక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు లకు మరింత నష్టం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. పత్తి మద్దతు ధర రూ. 8,100 ఉంటే ప్రభుత్వం కొనక పోవడంతో గత్యంతరం లేక దళారులకు రైతులు రూ. 5,900 లకు అమ్ము కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులకు క్వింటాలుకి 2 వేల రూపాయలు నష్టం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలు మొక్కజొన్న సాగు జరిగిందన్నారు. మక్కలు మార్కెట్‌లో పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 30%-40% వరకు రైతులు దళారులకు అమ్ముకున్నారని , వీరి విషయంలో ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడో చెప్పాలని అన్నారు.
Also Read : KTR Fired on Congress Govt : మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్
















