కర్నూలు జిల్లా : మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిందన్నారు తీరా అధికారంలోకి వచ్చాక తమ వ్యక్తిగత ప్రచారం పైనే ఫోకస్ పెట్టారు తప్పా ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన తన పదవికి న్యాయం చేయడం లేదన్నారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తన పదవికి న్యాయం చేయాల్సింది పోయి సినిమా షూటింగ్ లపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడని ధ్వజమెత్తారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేశారు మాజీ మంత్రి. కేంద్రం నుంచి పంచాయితీ శాఖకు రూ.1,000 కోట్లు వచ్చాయని అన్నారు. మరి ఆ నిధులు స్థానిక సంస్థలకు ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. దీనికి ముందు సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎంను డిమాండ్ చేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. మీ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా ఏపీకి రావాల్సిన ఇంకో రూ. 1000 కోట్లు ఆగిన ఆట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎందుకు దాయడం అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల పట్ల కూటమి సర్కార్ కు చిత్తశుద్ది లేకుండా పోయిందన్నారు.

















