ఢిల్లీ : స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సీరీస్ లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ కోచ్ సంజయ్ బంగర్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమిపై , ప్రదర్శనపై మండిపడ్డారు. ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్‌తో ముందుకు వెళ్లాలనే టీమ్ ఇండియా వ్యూహం కూడా ఈ బ్యాటర్ పతనంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ముఖ్య పాత్ర పోషించిందని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. వరుస వైఫల్యాలు ఎదురైన సమయంలో దేశీవాళి క్రికెట్ లో ఆడాల్సి ఉండేదని పేర్కొన్నారు సంజయ్ బంగర్. తను హాఫ్ సెంచరీ చేసి చాలా కాలం అయ్యిందన్నారు. దాదాపు 20 ఇన్నింగ్స్ లలో దారుణంగా ఆడాడని పేర్కొన్నారు.
గత ఏడాది నవంబర్ నుండి కెప్టెన్ సూర్యకుమార్ 13.35 సగటుతో కేవలం 227 పరుగులు మాత్రమే చేశాడని ఇలాగైతే ఎలా అని ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల స్వదేశీ సిరీస్‌లో కూడా ఈ బ్యాటర్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోందని అన్నారు. మొదటి మ్యాచ్‌లో 12 పరుగులకే అవుటైన అతను, తర్వాతి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడని గుర్తు చేశాడు. వ్యక్తిగత నిర్ణయాలు చాలా ఇబ్బంది కలిగించేలా చేస్తాయన్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు సంజయ్ బంగర్. అయితే ఐపీఎల్ టోర్నీలో తను బాగా ఆడాడని గుర్తు చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున 16 మ్యాచ్ లలో 65.18 సగటుతో 717 రన్స్ చేశాడని అన్నారు. జట్టు కోచ్ కూడా తీసుసుకున్న నిర్ణయాలు ప్రభావం చూపుతాయని హెచ్చరించారు బంగర్.


















