YS Jagan Fired on AP Govt : ఏపీలో రాచ‌రిక‌..నియంతృత్వ పాల‌న : జ‌గ‌న్

ప్ర‌శ్నించే గొంతుక‌ల‌పై ఉక్కుపాదం మోపితే ఎలా

Hello Telugu - YS Jagan Fired on AP Govt

Hello Telugu - YS Jagan Fired on AP Govt

YS Jagan : అమ‌రావ‌తి – ఏపీలో రాచ‌రిక‌, నియంతృత్వ పాల‌న కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు మాజీ సీఎం జ‌గ‌న్ .
ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచి వేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ఒక పునాది వంటివన్నారు. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తోందని మండిప‌డ్డారు. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారని వాపోయారు. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలోనా? అన్న సందేహం కలుగుతోందన్నారు.

YS Jagan Slams AP Govt

ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదన్నారు. దారుణంగా వేధిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు జ‌గ‌న్ రెడ్డి (YS Jagan). లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండ కూడదన్న విధంగా వ్యవహరించ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదన్నారు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటేన‌ని, ఒక పద్దతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని, అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండొద్దనేది. ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.

Also Read : YS Sharmila Shocking Comments : బనకచర్ల ప్రాజెక్ట్ చంద్రబాబుకి ఏటీఎం : ష‌ర్మిల

Exit mobile version