Prakasam Barrage : విజయవాడ – భారీ వర్షాల దెబ్బకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది ప్రకాశం బ్యారేజీకి. దీంతో ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) ఆనుకున్న ప్రాంతాలన్నీ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు తీసుకోవాలని, ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజీకి 65,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. మూడు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇరిగేషన్ అధికారులు. ఈ వరద నీరు ఇవాళ మధ్యాహ్నం నాటికి చేరుకుంటుందని వెల్లడించారు.
Prakasam Barrage Water Flow
ఎగువున కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు బ్యారేజి కి వస్తున్నట్లు చెప్పారు కలెక్టర్. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు . ఇసుక బస్తాలు, ఇతర రక్షణ చర్యలు చేపట్టేలా స్థానికంగా ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా…క్షేత్ర స్థాయిలో పరిస్థితి బట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో 12 ఏళ్ల తర్వాత 18 గేట్లను ఎత్తి వేశారు. మరో వైపు శ్రీశైలం, తుంగభద్ర, శ్రీరాం సాగర్ , సుంకేశుల, సోమశిల ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి.
Also Read : Deputy CM Bhatti Inspiring Meet : చిన్ననాటి స్నేహితుడితో భట్టి ముచ్చట



















