ఎట్ట‌కేల‌కు ఒక్క‌టైన మోనాలిసా ఫ‌ర్మాన్ ఖాన్

సంచ‌ల‌నంగా మారిన ప్రేమ వ్య‌వ‌హారం..దుమారం

hellotelugu-MonalisaKhan

తిరువ‌నంత‌పురం : ప్ర‌యాగ్ రాజ్ లో జ‌రిగిన కుంభ మేళాలో పూస‌లు అమ్ముతూ సెన్సేష‌న్ అయిన మోనాలిసా సంచ‌ల‌నంగా మారింది మ‌రోసారి. ఇప్పుడు పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోవ‌డం విశేషం. త‌ను ముస్లిం మ‌తానికి చెందిన ఫ‌ర్మాన్ ఖాన్ వ‌ల‌లో ప‌డింది. త‌న‌ను గాఢంగా ప్రేమించింది. చివ‌ర‌కు త‌న‌కు త‌నే కావాల‌ని కోరుతూ కేర‌ళ లోని తిరువనంతపురంలో పోలీసుల‌ రక్షణ కోరింది. కాగా మోనాలిసా భోస్లే తన ప్రేమ వ్యవహారంపై తన కుటుంబం నుండి వ్యతిరేకత రావడంతో కేరళకు చేరుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం తాను ప్రేమించిన ప్రియుడి స్వ‌స్థ‌లం కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం. ఇక మోనాలిసా నేటివ్ ప్లేస్ మ‌ద్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్.

చివ‌ర‌కు తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో కలిసి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తన కుటుంబం, ముఖ్యంగా తన తండ్రి జై సింగ్ భోస్లే తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని, తనను బెదిరిస్తున్నారని ఆమె పోలీసులతో వాపోయింది. పోలీసుల ప్రకారం, మోనాలిసా, ఫర్మాన్ ఫేస్‌బుక్ ద్వారా కలిశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా సంబంధంలో ఉన్నారు. తమ సొంత రాష్ట్రాలలోని వారి కుటుంబాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడి ఈ జంట సురక్షితమైన స్థలం కోసం కేరళకు వెళ్లినట్లు సమాచారం. సనోజ్ మిశ్రా దర్శకత్వం వహించిన , నటుడు రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటించిన తన తొలి చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు వచ్చింది. ఈ ఇద్ద‌రూ ఒక్క‌టి కావ‌డంతో క‌థ సుఖాంత‌మైంది.

Exit mobile version