TCS : హైదరాబాద్ : దేశీయ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ పవర్‌హౌస్ (టీపీజీ) తో జతకట్టి, భారత కృత్రిమ మేధస్సు (ఏఐ) మౌలిక వసతుల రంగంలోకి అత్యంత భారీగా అడుగు పెట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి ‘హైపర్‌వాల్ట్’ (Hyper Vault) పేరిట ఏర్పాటు చేయబోయే అత్యాధునిక ఏఐ డేటా కేంద్రాలపై ఏకంగా రూ.18,000 కోట్ల (దాదాపు $2 బిలియన్లు) భారీ పెట్టుబడిని ప్రకటించాయి.
TCS Hyper Vault Excitement
ఈ డీల్‌లో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న టీపీజీ, ఈ మొత్తం పెట్టుబడిలో 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,870 కోట్లు) సమకూర్చనుంది. ఈ పెట్టుబడితో హైపర్‌వాల్ట్‌లో టీపీజీకి 27.5% నుండి 49% వరకు వాటా లభిస్తుంది. ఈ మెగా ఫండింగ్ ద్వారా టీసీఎస్‌పై పెట్టుబడి భారం గణనీయంగా తగ్గడమే కాక, వారి అంతిమ లక్ష్యమైన 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా కేంద్రాల నిర్మాణానికి (మొత్తం ప్రణాళిక వ్యయం రూ.57,000 కోట్లు) మరింత వేగం పుంజుకోనుంది.
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ భాగస్వామ్యాన్ని ‘ఏఐ భవిష్యత్తుకు మార్గం’గా అభివర్ణించారు. టీపీజీ సహకారంతో ఏఐ కంపెనీలతో మరింత బలమైన బంధాన్ని ఏర్పరచుకొని, టీసీఎస్ ఖాతాదార్లకు పూర్తిస్థాయి ఏఐ సొల్యూషన్స్‌ను అందించడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కేంద్రాలు కేవలం సాంకేతిక అద్భుతాలే కాక, హరిత ఇంధనం, మౌలిక వసతులు, టెక్నాలజీ, స్థిరాస్తి భాగస్వామ్యంతో ఏర్పాటవుతాయని టీపీజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జిమ్ కోల్టర్ వివరించారు.
ఈ అత్యాధునిక ఏఐ డేటా కేంద్రాలు హైపర్‌స్కేలర్లకు, AI సంస్థలకు, ప్రభుత్వ ఏజెన్సీలకు కంప్యూటర్ హార్డ్‌వేర్ నిర్వహణ, హైస్పీడ్ స్టోరేజీ, తక్కువ జాప్యం ఉన్న నెట్‌వర్క్ వంటి అత్యున్నత సేవలను అందిస్తాయి.హైపర్‌వాల్ట్ ప్రాజెక్టు కింద తొలి దశలో హైదరాబాద్, నవీ ముంబై, చెన్నై వంటి సాంకేతిక హబ్‌లపై దృష్టి సారిస్తున్నారు. అయిత టీసీఎస్ యొక్క 1 GW మెగా లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌లోని తీర నగరం విశాఖపట్నంను అత్యంత కీలకమైన, భారీ-స్థాయి వ్యూహాత్మక కేంద్రంగా ఎంచుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గ్లోబల్ దిగ్గజం గూగుల్‌తో పాటు, దేశీ దిగ్గజం టీసీఎస్ కూడా వస్తే వైజాగ్ ను ‘AI సిటీ’గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి ఈ భారీ పెట్టుబడి అపారమైన బలాన్ని చేకూరుస్తుంది. రావాలని కోరుకొందాం.
Also Read : YS Sharmila Fired on AP Govt : గంగపుత్రుల గోస పట్టంచుకోని సర్కార్



















