Chevireddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సిట్ కార్యాలయంలో మూడు గంటలకు పైగా అధికారులు ఆయనను విచారణ చేశారు. అయితే, సిట్ అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి (Chevireddy) ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చదువుకుని సంతకాలు చేయమని ఇచ్చిన డాక్యుమెంట్ లను చెవిరెడ్డి చించివేశారని వార్తలు వినిపిస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు.
Ex MLA Chevireddy Sensational
అయితే, మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు. 26 ప్రశ్నలకుఅధికారులు వారికి నచ్చిన సమాధానాలు రాసుకున్నారన్నారు. 27వ ప్రశ్నకు తానే స్వయంగా తీసుకుని పైన జవాబులు నేను చెప్పినవి కాదని రాసినట్లు వెల్లడించారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని, విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని ముందే సమాచారం ఇచ్చానన్నారు. అయినా కూడా కుట్రతోనే తనను అరెస్టు చేశారని ఏసీబీ కోర్టుకు చెవిరెడ్డి తెలిపారు. అయితే, కోర్టు వద్ద తనను అన్యాయంగా అరెస్టు చేశారని, అందరి సంగతి చూస్తానంటూ చెవిరెడ్డి హడావుడి చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Israel-Iran Attack : ఇరాన్ నుంచి 110 భారతీయ విద్యార్థులతో ఢిల్లీకి చేరిన విమానం


















